News March 23, 2024
KTDM: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ

మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ముందస్తుగా సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచారు. కొత్తగూడెం, భద్రాచలం,ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నాయని.. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.

News April 14, 2026
గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.