News October 25, 2025
KTDM: అకాల వర్షాలతో అన్నదాతల కుదేలు

కొత్తగూడెం జిల్లాలో కొన్నిచోట్ల కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పట్ల శాపంలా మారాయి. ఆళ్లపల్లి మండలంలో అకాల వర్షాలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. కోతకు సిద్ధమైన వరి నీరు నిలిచి నేలవాలుతోంది. వర్షాల కారణంగా కోతలు ఆలస్యమవుతున్నాయి. అధిక తేమతో పత్తి, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Similar News
News October 25, 2025
విశాఖ: 69 మంది పోలీసులకు రివార్డులు

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 69 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
News October 25, 2025
NRPT: డిజిటల్ భద్రతపై అవగాహన సదస్సు

డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించేందుకు నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ…
ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో డిజిటల్ బాధ్యతా భావం పెంచి, సైబర్ భద్రత సంస్కృతిని బలపరుస్తాయని అన్నారు. హైద్రాబాద్‌కు చెందిన సైబర్ నిపుణులు, న్యాయవాది రూపేష్ మిత్తల్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
News October 25, 2025
నారాయణపేట: చిరుత పులి మృతి

నారాయణపేట జిల్లా పేరపళ్ళ రెవెన్యూ అటవీ ప్రాంతంలో శనివారం స్థానికులు ఒక చిరుత పులి మృతిచెందినట్లు గుర్తించారు. ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల్ ఉద్దీన్‌తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. చిరుతపులి మృతికి కారణాలపై విచారణ చేస్తామన్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కళేభరం తరలించారు. పోస్టుమార్టం తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.


