News March 25, 2025

KTDM: ‘అగ్నివీర్ ఎంపిక కోసం దరఖాస్తులు చేసుకోండి’

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అవివాహిత పురుష అభ్యర్థులు 2026వ సంవత్సరానికి గానూ అగ్నివీర్ ఎంపిక కోసం దరఖాస్తులను ఆన్‌లైన్లో చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ సోమవారం తెలిపారు. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం WWW.JOININDIANARMY.NIC.IN అనే వెబ్సైట్‌ను చూడవచ్చన్నారు.

Similar News

News March 2, 2026

HYD: నీటిలో మురుగు.. జలమండలికి ఉరుకు!

image

నగర తాగునీటిలో కాలుష్య సెగ తగలకుండా జలమండలి ‘బస్తీ బాట’ పట్టింది. పైపులైన్లు లీకై మురుగునీరు కలిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించడంతో అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. రోజూ 5 వేల శాంపిల్స్ పరీక్షలు చేస్తున్నా, పురాతన పైపులైన్ మార్పు జలమండలికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్రమ కనెక్షన్లే కాలుష్యానికి కేంద్రాలని గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు.

News March 2, 2026

ట్రంప్ నిర్ణయానికి US ప్రజల మద్దతుందా?

image

US-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన సైనిక దాడులను అమెరికా ప్రజలు స్వాగతించడం లేదని తెలుస్తోంది. ‘Reuters Ipsos’ సర్వే ప్రకారం కేవలం 25% మంది అమెరికన్లు మాత్రమే ఈ దాడులను సమర్థించారు. 43% మంది యుద్ధాన్ని వ్యతిరేకించగా 29% మంది అభిప్రాయం చెప్పలేదు. అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే ఈ మద్దతు మరింత తగ్గుతుందని సర్వే వెల్లడించింది. మధ్యంతర ఎన్నికల వేళ ఇది ట్రంప్ ప్రభుత్వానికి సవాల్‌గా మారొచ్చు.