News April 1, 2024

KTDM: ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోల లెటర్ 

image

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను తన్ని తరమండి అంటూ ఆదివారం మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ చర్ల విలేకరులకు లేఖను పంపారు. ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని, బీజేపీ ఈసారి కూడా దేశంలో తమదే అధికారం అని విర్రవీగుతుందని లేఖలో పేర్కొన్నారు. బూటకపు పార్లమెంటు ఎన్నికలను తరిమి కొట్టండి అంటూ మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.