News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News March 26, 2025
అచ్చెన్నకు నిమ్మల బర్త్ డే విషెస్

ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచెన్నాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. అమరావతిలోని అచ్చెన్న కార్యాలయానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానం చేశారు.
News March 26, 2025
వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?

కొందరికి చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే వేసవి కాలంలో రెగ్యులర్‌గా చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ పెరగడం, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు తింటే ప్రమాదం లేదని పేర్కొంటున్నారు.
News March 26, 2025
నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.