News March 20, 2024
KTDM: పోస్టుమాస్టర్ చేతివాటం

దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం పోస్టల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న బ్రాంచ్ పోస్టు మాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దాదాపు రూ.50వేలకు పైగా పలువురు ఖాతాదారుల ఖాతాల్లో నుంచి వారికి తెలియకుండా నగదు మాయం కావడంపై పోస్టల్ భద్రాచలం ఎస్పీ సుచేందర్ విచారణ చేపట్టారు. ఖాతాదారుల పాసు పుస్తకంలో నగదు చెల్లించినట్టు పోస్టల్ స్టాంప్ సైతం వేసిన పోస్టుమాస్టర్ వారి ఖాతాలో మాత్రం నగదు జమ చేయకపోవడం గమనార్హం.
Similar News
News September 7, 2025
అసంపూర్తి గణనాథుల నిమజ్జనం.. భక్తుల ఆవేదన

ఖమ్మం మున్నేరు నది ఒడ్డున అసంపూర్తిగా నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనం సరిగా జరగలేదని విమర్శించారు. అధికారులు స్పందించి విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News September 7, 2025
ఖమ్మం: రేపు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
News September 7, 2025
ఖమ్మం: నవంబరు 23న ఉపకార వేతన పరీక్ష

2025-26 విద్యాసంవత్సరంలో నవంబరు 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఆన్ లైన్‌లో చెల్లించాలని సూచించారు.