News January 10, 2026
KTDM: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం

అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె ఐదు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News February 21, 2026
తెనాలి: ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం

తెనాలికి చెందిన B ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో రీ పోస్టుమార్టం కోసం మృతదేహం నుంచి సేకరించిన శరీర అవశేషాలను ఈనెల 27న తల్లిదండ్రులకు అప్పగించాలని CBI కోర్టు ఆదేశించింది. శరీర అవశేషాలకు అదే రోజు మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, వీడియో చిత్రీకరించాలని కోర్టు ఆదేశించింది.
News February 21, 2026
అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ , అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News February 21, 2026
ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.


