News March 27, 2025
KTDM: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని ఆమె అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చెసినట్లు సమాచారం. కాగా, DCCలతో నేడు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News December 6, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి

పెనమలూరు పరిధిలోని ముద్దునూరులో 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. 4న ఆయన చనిపోగా, ఇవాళ రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
News December 6, 2025
కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?
News December 6, 2025
SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.


