News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News March 29, 2025
దోమల పెంట వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

అమ్రాబాద్ మండలం శ్రీశైలం-HYD ప్రధాన రహదారి దోమల పెంట సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. శ్రీశైలం నుంచి HYD వెళ్తున్న బీహెచ్ఈఎల్ ఆర్టీసీ బస్సు, HYD నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2025
వొకేషనల్ పరీక్షకు 117 మంది గైర్హాజరు: డీఈవో

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షలు పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించామన్నారు.
News March 29, 2025
ఉగాది పురస్కారానికి ఎంపికైన”పుట్టం రాజు”

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం 2025కు అద్దంకికి చెందిన సాహితీవేత్త పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి ఎంపికైనట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృత సమితి శనివారం వెల్లడించింది. పుట్టం రాజు సాహిత్య రంగంలో విశేష సేవలు అందించి పలు పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని పుట్టంరాజు అందుకోనున్నారు