News July 24, 2024
KTRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి కలిశారు. బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.
Similar News
News November 28, 2025
నల్గొండ: సోషల్ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.
News November 27, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి
News November 27, 2025
నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.


