News February 10, 2025
KTRకు పరిగి MLA సవాల్

KTRకు దమ్ము, ధైర్యం ఉంటే కొడంగల్లో ఒక జడ్పీటీసీ లేదా ఎంపీపీ గెలవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజీనామాకు తమ నాయకుడు రేవంత్ రెడ్డి అవసరం లేదన్నారు. తాను సిద్ధంగా ఉన్నానని గతంలో కేటీఆర్, హరీశ్ రావుకు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరానని MLA గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కొడంగల్ను పట్టించుకోలేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.
Similar News
News October 28, 2025
వనపర్తి: అంతరాలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలి

వనపర్తిలో జరిగిన పీడీఎస్యూ (PDSU) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల, మత, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. శాస్త్రీయ ఆలోచనలతో సమానత్వ భావనను బలోపేతం చేయాలని విద్యార్థులకు సూచించారు.
News October 28, 2025
సత్యసాయి జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

పుట్టపర్తి పట్టణంలో నవంబర్ 23న సత్యసాయి 100వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. మంగళవారం విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్ మర్యాదపూర్వక కలిసి ఆయనను ఆహ్వానించారు. జయంతి వేడుకలకు పీఎంతో కలిసి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>


