News February 10, 2025

KTRకు పరిగి MLA సవాల్

image

KTRకు దమ్ము, ధైర్యం ఉంటే కొడంగల్‌లో ఒక జడ్పీటీసీ లేదా ఎంపీపీ గెలవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజీనామాకు తమ నాయకుడు రేవంత్ రెడ్డి అవసరం లేదన్నారు. తాను సిద్ధంగా ఉన్నానని గతంలో కేటీఆర్, హరీశ్ రావుకు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరానని MLA గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కొడంగల్‌ను పట్టించుకోలేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

Similar News

News March 7, 2026

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్

image

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. మార్చి 9 నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెలక్షన్స్ ప్రారంభమవుతాయి. 9, 10 తేదీల్లో మహిళలకు, 12 నుంచి 16 వరకు పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్ లేదా డిప్లొమాలో 50% మార్కులు ఉండాలి.

News March 7, 2026

HYDలో హాకీ సమరం.. కెప్టెన్లకు ఘన స్వాగతం

image

హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న FIH మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2026 వేడుకలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత్, ఇంగ్లాండ్, కొరియా సహా 8 దేశాల కెప్టెన్లకు క్రీడా శాఖ అధికారికంగా స్వాగతం పలికింది. భారత జట్టుకు సలీమా టెటె నాయకత్వం వహిస్తుండగా.. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. భాగ్యనగరంలో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొంది.

News March 7, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

image

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.