News January 6, 2025
KTRకు ACB నోటీసులివ్వడం శోచనీయం: వద్దిరాజు

న్యాయస్థానం పరిధిలో ఉన్నా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఏసీబీ అధికారులు విచారణకు పిలవడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తప్పుబట్టారు. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో KTRపై అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసు వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం శోచనీయం అన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.
News December 17, 2025
బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్ పనులపై మంత్రి సమీక్ష

సత్తుపల్లిలోని బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్లో మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో 200 ఎకరాల మెగా ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ జోన్లలో యూనిట్ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలన్నారు.
News December 17, 2025
ఖమ్మం విద్యార్థికి 18 ఉద్యోగాలు.. మెచ్చిన గూగుల్

గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాంపిటీషన్లో ఖమ్మం విద్యార్థి వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి రూ.6.50 లక్షల బహుమతిని అందుకున్నారు. ఖమ్మంలో ఇంటర్ నుంచి బీటెక్ వరకు పూర్తి చేసిన కార్తీక్ రెడ్డి తర్వాత ఉద్యోగంలో చేరారు. తర్వాత ఈ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిచారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనూ 18 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.


