News January 6, 2025

KTRకు ACB నోటీసులివ్వడం శోచనీయం: వద్దిరాజు 

image

న్యాయస్థానం పరిధిలో ఉన్నా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఏసీబీ అధికారులు విచారణకు పిలవడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తప్పుబట్టారు. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో KTRపై అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసు వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం శోచనీయం అన్నారు. 

Similar News

News January 16, 2025

కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News January 16, 2025

ప్రత్తి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన తుమ్మల

image

ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని మంత్రి తుమ్మల సందర్శించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఐజీతో మట్లాడి ఓ ఫైర్ ఇంజిన్ ను పర్మినెంట్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంచాలన్నారు. 

News January 16, 2025

ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు 

image

ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు.