News May 19, 2024

KTR‌ను ఎర్రగడ్డలో అడ్మిట్ చేయాలి: కాంగ్రెస్ నేతలు

image

BRS అధికారం కోల్పోయిన తర్వాత KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి విజితా రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లకుంటలో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో INCకి ఒక్క MP సీటు కూడా రాదని KTR వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, మానసిక వైద్య చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

Similar News

News November 28, 2024

HYD: ఆకర్షణ 18వ లైబ్రరీని ఓపెన్ చేసిన రాష్ట్ర గవర్నర్

image

8వ క్లాస్​ స్టూడెంట్ ఆకర్షణ(13) అనాథాశ్రమాలు, పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ర్ట గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. మూసాపేటలోని సాయి సేవా సంఘం అనాథ పిల్లల ఆశ్రమంలో ఆకర్షణ 18వ లైబ్రరీని గవర్నర్​ ప్రారంభించారు. పలు పుస్తకాలను విద్యార్థులకు అందచేశారు. పాకెట్​ మనీతో పాటు తాను సేకరించిన పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ నేటి తరం స్టూడెంట్స్​‌కు ఆదర్శమన్నారు.

News November 28, 2024

HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు

image

సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.

News November 28, 2024

HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!

image

HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.