News January 8, 2025
KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్
KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.
Similar News
News January 10, 2025
ప్రజాక్షేత్రంలో మిస్టర్ క్లీన్ కేటీఆర్: జీవన్ రెడ్డి
ప్రజాక్షేత్రంలో KTR ను మిస్టర్ క్లీన్ గా ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప CM రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని ఆయన ఆరోపించారు. రేవంత్ లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్‌కు లేదన్నారు.
News January 9, 2025
NZB: అక్కడ ఆ తేదీల్లో సౌకర్యాలు కల్పించండి: మైనారిటీ కమిషన్ ఛైర్మన్
నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19, 20, 21 తేదీలలో జరిగే ఇజ్తెమాకు తగు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ మున్సిపల్ కమిషనర్ దిలీప్ ను ఆదేశించారు. ఈ ఇజ్తెమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30 వేల పైచిలుకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
News January 9, 2025
గోలిలింగాల గ్రామ కార్యదర్శిగా సంతోష్ కుమార్
నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామ నూతన కార్యదర్శిగా సంతోష్ కుమార్ నియమితులయ్యారు. దీంతో ఇవాళ గ్రామ పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. సంతోష్ కుమార్.. గోలిలింగాల గ్రామ కార్యదర్శిగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో బొల్లారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గ్రామపెద్దలు పేర్కొన్నారు.