News January 8, 2025
KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్
KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.
Similar News
News January 14, 2025
నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News January 14, 2025
NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం
గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
బాల్కొండ: హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.