News October 28, 2024
‘KTRను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారు’
KTRను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని మాజీమంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. KTR బావమరిది జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ ఆఫీసర్లు బాటిళ్లు తప్ప డ్రగ్స్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారని అన్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో సెర్చ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సోదాలు ఆపాలని డీజేపీని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు.
Similar News
News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News February 3, 2025
NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా
నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News February 2, 2025
NZB: దిల్ రాజుకు ఆహ్వానం
నిజామాబాద్‌లో వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఆదివారం వారాహి మాత ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 10న ఆలయ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని వివరించారు.