News October 27, 2024
జన్వాడ రేవ్ పార్టీలో KTR బామ్మర్ది

TG: జన్వాడ ఫామ్హౌస్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ ఫామ్హౌస్ యజమాని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలగా పోలీసులు గుర్తించారు. పార్టీ కూడా అతడే నిర్వహించినట్లు నిర్ధారించారు. మొత్తం 35 మంది యువతీయువకులు పార్టీలో పాల్గొనగా విజయ్ మద్దూరి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. దీంతో రాజ్ పాకాలపై చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్లో 34ఏ, 34(1), రెడ్విత్ 9 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Similar News
News December 1, 2025
వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు మాట్లాడేనా..?

కడప-రేణిగుంట హైవే నిర్మాణానికి ఫారెస్ట్ శాఖ అనుమతులు ఇచ్చినా వర్కింగ్ పర్మిషన్ ఇంకా రాలేదు. ఇటీవల కళత్తూరు హరిజనవాడలో చెరువు తెగి అందరూ నష్టపోగా సరైన సాయం అందలేదు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడలేదు. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు గురుమూర్తి, ప్రసాదరావు గళమెత్తుతారా? లేదా?
News December 1, 2025
రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News December 1, 2025
అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.


