News January 8, 2025
సుప్రీంకు వెళ్లినా కేటీఆర్ తప్పించుకోలేడు: మహేశ్ కుమార్

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Similar News
News December 3, 2025
సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.
News December 3, 2025
DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్‌పై YCP సెటైర్లు

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్‌లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
News December 3, 2025
పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.


