News March 27, 2025
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

TG: రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని KTR నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్‌లో ఎక్కడైనా నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని CM రేవంత్‌కు సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపే అధికారం CMకు ఉండదని, నేరాలు నిర్ధారించి జైలుకు పంపేది కోర్టులని స్పష్టం చేశారు.
Similar News
News March 30, 2025
ఈ పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే: మంత్రి ఉత్తమ్

TG: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఉచిత సన్న బియ్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలనే తన నియోజకవర్గంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణే ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, దీంతో పక్కదారి పడుతోందని పేర్కొన్నారు.
News March 30, 2025
IPL: చెన్నై బౌలింగ్.. జట్లివే

IPL-2025: గువాహటి వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: గైక్వాడ్, రచిన్, త్రిపాఠి, ధోనీ, జడేజా, విజయ్ శంకర్, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరణ, ఓవర్టన్, ఖలీల్
RR: జైస్వాల్, శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మేయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.
News March 30, 2025
కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.