News August 24, 2025

సీఎం రేవంత్‌కు KTR సవాల్

image

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.

Similar News

News August 24, 2025

రాత్రి కొబ్బరినూనె తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

image

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్‌, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.

News August 24, 2025

రేపట్నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: నాదెండ్ల

image

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

News August 24, 2025

సీఎం సహాయనిధికి చిరంజీవి రూ.కోటి విరాళం

image

AP: సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి విరాళం అందించారు. హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబును ఆదివారం కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ గతంలోనూ వరద సాయం కింద రూ.కోటి అందించారని గుర్తుచేశారు.