News June 4, 2024
చంద్రబాబు, పవన్‌కు కేటీఆర్ అభినందనలు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ మాజీ మంత్రి, BRS నేత కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మీరు ఏపీ ప్రజల సేవలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 21, 2025
అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.
News October 21, 2025
ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
News October 21, 2025
పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.