News November 15, 2024

కేటీఆర్, హరీశ్ ఒకే పార్టీలో ఉండరు: TPCC చీఫ్

image

TG: పలువురు బీఆర్ఎస్ అగ్ర నాయకులు బీజేపీలోకి వెళ్తారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు ఒకే పార్టీలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని మహేశ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు.

Similar News

News March 25, 2026

హార్ముజ్: పాక్‌ నౌకకు ఝలక్ ఇచ్చిన ఇరాన్

image

పశ్చిమాసియా యుద్ధం వేళ పాక్‌కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హార్ముజ్ నుంచి కరాచీ వెళ్తున్న పాక్ నౌకను వెనక్కి రప్పించినట్లు IRGC తెలిపింది. హార్ముజ్ నుంచి వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కాబూల్‌లోని ఇరాన్ కార్యాలయం ధ్రువీకరించింది. జలసంధి నుంచి వెళ్లే ప్రతినౌక ఇరాన్ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకుంటామని IRGC హెచ్చరించింది.

News March 25, 2026

స్టాక్ మార్కెట్లకు శాంతి చర్చల జోష్!

image

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద, సెన్సెక్స్ 1,205 పాయింట్లు ఎగసి 75,273 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, L&T, టైటాన్, ట్రెంట్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి.

News March 25, 2026

ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.