News October 25, 2024
కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది: ఆది శ్రీనివాస్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అన్ని పథకాల్లో అవినీతి చేసి ఉత్తర కుమారుడిలా KTR ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. నాలుగు రోజులు ఆగితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఇకపై తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించబోరని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల సిలిండర్ ధరను రూ.49 పెంచాయి. ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో రిటైల్‌లో ₹1,740.50 పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ట్రెండ్స్, దేశీయ వ్యయాల ఆధారంగా ధరలను కంపెనీలు సవరించాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. పాత ధరలే కొనసాగనున్నాయి.
News February 1, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులు.. అప్లై చేశారా?

AP: గుంటూరు జిల్లాలోని UPHC, PHCలో ఖాళీగా ఉన్న 45 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హతగల వారు <
News February 1, 2026
సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న నిర్మల

కేంద్ర మంత్రి నిర్మల 75 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్నారు. 2 భాగాల బడ్జెట్‌లో పార్ట్ Aకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థితిని సమీక్షించే, విధాన దిశను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు అందులో ఉంటాయి. పన్ను సంబంధిత ప్రకటనలకే పార్ట్Bని పరిమితం చేస్తారు. ఈ సారి పార్ట్ B ద్వారానే ఇండియా ఎకనమిక్ విజన్‌ను నిర్మల ఆవిష్కరించనున్నారు. ట్రేడ్, కస్టమ్స్, ఎగుమతులు, తయారీపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.


