News September 30, 2024

కేటీఆర్ డబ్బులిచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు: సురేఖ

image

TG: తనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన మొదట్నుంచీ మహిళలను అవమానిస్తున్నారని, డబ్బులు ఇచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలని, లేదంటే తెలంగాణ మహిళలంతా తిరగబడతారని మంత్రి హెచ్చరించారు.

Similar News

News November 17, 2025

మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

image

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.

News November 17, 2025

ఈ మహిళలు ఏడాదికో కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చు!

image

రాజస్థాన్‌లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి మహిళలు జాతరలో తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సహజీవనం చేశాక గర్భం దాల్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చకపోతే మహిళ విడిపోయి మళ్లీ కొత్త వ్యక్తిని వెతుక్కునే స్వేచ్ఛ ఉంది. ఈ సహజీవనం కోసం అబ్బాయి అమ్మాయికి డబ్బు చెల్లించాలి. ఒకవేళ మహిళ మరొకరితో జీవించాలనుకుంటే ఎంచుకున్న కొత్త వ్యక్తి మాజీ భాగస్వామికి అధిక మొత్తంలో డబ్బు చెల్లించాలి.

News November 17, 2025

బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

image

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.