News October 23, 2024
కేటీఆర్.. కాచుకో: బండి సంజయ్

TG: మాజీ మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీస్ <<14431301>>పంపడంపై<<>> కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని స్పష్టం చేశారు. ‘నన్ను అవమానిస్తే, నేను బదులిచ్చా. విమర్శలకు నోటీసులే సమాధానమా? అయితే నేను కూడా నోటీసులు పంపిస్తా.. కాచుకో. మాటకు, మాట.. నోటీసుకు నోటీసులతోనే బదులిస్తా’ అని అన్నారు.
Similar News
News March 16, 2025
సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.
News March 16, 2025
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. HYD ఫిలింనగర్‌లోని విశ్వక్ ఇంట్లో రెండు డైమండ్ రింగులు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై విశ్వక్ తండ్రి సి.రాజు ఫిలింనగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి వాటిని తస్కరించినట్లుగా గుర్తించారు.
News March 16, 2025
నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవొద్దు: సైరా బాను

సంగీత దర్శకుడు రెహమాన్ నుంచి తానింకా విడాకులు తీసుకోలేదని సైరా బాను ఓ ప్రకటనలో తెలిపారు. తనను అప్పుడే మాజీ భార్యగా పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా అనారోగ్య సమస్యల కారణంగా మేం విడిపోయాం తప్ప ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈరోజు ఆస్పత్రిపాలైన ఆయన వేగంగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు. ఈ దంపతులకు 1995లో పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. తాము విడిపోతున్నట్లు గత ఏడాది నవంబరులో బాను ప్రకటించారు.