News May 15, 2024
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

ఎంపీ ఎన్నికల హడావిడి ముగియడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాల రచన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యనేతలతో నేడు సమావేశం కానున్నారు. మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 4, 2026
త్వరలో ఢిల్లీకి కేసీఆర్?

TG: రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మౌనంగా ఉన్న BRS చీఫ్ KCR త్వరలో పూర్తిస్థాయిలో యాక్టివ్ కానునట్లు తెలుస్తోంది. APRలో ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. త్వరలో జరిగే TN, WB, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాల రాజకీయ మిత్రులను కలుస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. CMలు స్టాలిన్, మమత, పినరయ్ విజయన్‌లతో KCRకు మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీలో BRS ఆఫీసునూ సందర్శిస్తారు.
News March 4, 2026
ట్రంప్ ‘వీకెండ్’ వార్స్ వెనక ‘మార్కెట్’ ప్లాన్!

ట్రంప్ హయాంలో జరిగిన ప్రధాన దాడులన్నీ (ఇరాన్, వెనిజులా, నైజీరియా) శని, ఆదివారాల్లోనే కావడం గమనార్హం. దీని వెనక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్స్‌లో స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో యుద్ధంపై ఇన్వెస్టర్లు వెంటనే స్పందించి షేర్లను అమ్మకుండా ఉంటారు. సోమవారం మార్కెట్లు తెరిచే నాటికి ఓ అంచనా వచ్చి భారీ పతనం తప్పుతుంది. ఈ 48 గంటల్లో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ చూసుకునే అవకాశం ఉంటుంది.
News March 4, 2026
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక BGM కోసం దేవిశ్రీప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.


