News November 15, 2024
లగచర్ల కేసు నిందితులతో కేటీఆర్ ములాఖత్

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.
Similar News
News November 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 6

శంకర సువన కేసరీనందన|
తేజ ప్రతాప మహా జగవందన||
హనుమంతుడు సాక్షాత్తూ శివుని అంశ నుంచి జన్మించాడు. అలాగే కేసరి నందనుడు. ఆయన తేజస్సు, ప్రతాపం అపారం. అందుకే సమస్త జగత్తు ఆయనకు నమస్కరిస్తుంది. ఆయన దర్శనం, స్మరణ మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతాయి. ప్రతికూల పరిస్థితులలో భయం వీడేలా ఆయన తేజస్సు మనకు శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 11, 2025
నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..

TG: ఇవాళ <<18244091>>జూబ్లీహిల్స్<<>> అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉ.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJP మధ్య పోటీ నెలకొంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
News November 11, 2025
ఏపీ టుడే

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ


