News November 13, 2024

పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్

image

TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 25, 2025

క్షుద్రపూజల ఘటనలపై తెలంగాణ HRC సీరియస్

image

క్షుద్ర పూజల ఘటనలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. జంగావ్, వరంగల్, జగిత్యాల జిల్లాలలో అదీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే జరగడం పట్ల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. చిన్నారుల్లో భయం, మానసిక కలతలకు దారితీసే ఈ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. 3 జిల్లాల కలెక్టర్లు, వారంగల్ సీపీ, జగిత్యాల ఎస్పీ నుంచి DEC29వ తేదీ ఉ.11 గంటలకు పూర్తి నివేదికలు సమర్పించాలని కోరింది.

News November 25, 2025

మున్సిపల్ వాటర్‌తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

image

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.

News November 25, 2025

T20 WC: గ్రూపుల వారీగా జట్లు

image

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్‌గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.