News January 15, 2025
నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.
Similar News
News February 2, 2026
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
News February 2, 2026
దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి?

పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదను ప్రసాదంగా స్వీకరించాలి. పిండిని చక్కెర పొంగలిలో కలపాలి. చిన్న చిన్న గారెలు చేసి స్వామికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు పంచుకోవాలి. పిండి దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకూడదు. చివరగా స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి, మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్రత ఫలితం పూర్తయి, సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం.
News February 2, 2026
అరకు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాజెక్ట్

AP: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రెండు ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రకటించారు. అరకులో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ కోసం మౌంటైన్ ట్రైల్స్ ప్రాజెక్టును, పులికాట్ సరస్సుకు వచ్చే వలస పక్షులను పర్యాటకులు దగ్గర నుంచి చూసేలా మరో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానున్నారు. తూర్పు కనుమల్లో పర్వత మార్గాలను ట్రెక్కింగ్ కోసం అభివృద్ధి చేసి అరకుకు మరింత గుర్తింపు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.


