News July 11, 2024

‘CBN ₹లక్ష కోట్లు డిమాండ్’ ప్రచారంపై స్పందించిన KTR

image

AP అభివృద్ధికి ₹లక్ష కోట్లు ఆర్థిక సాయం ఇవ్వాలని CM చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ఢిల్లీలో అనుకున్నది సాధించాలంటే ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయాలనేది ఇందుకే అని అన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ ట్వీట్ చేశారు.

Similar News

News January 19, 2025

అత్యధిక వికెట్లు.. కానీ CTలో నో ఛాన్స్

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి వన్డేల్లో ఎక్కువ వికెట్లు (71) తీసిన భారత బౌలర్ అతడేనని గుర్తు చేస్తున్నారు. అయితే సిరాజ్‌కు న్యూ బాల్‌తో బౌలింగ్ వేసే ఛాన్స్ రాకపోతే అంత ప్రభావవంతంగా కనిపించడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్ కొత్త, పాత బంతితో బౌలింగ్ వేయగలడని తెలిపారు. దీనిపై మీ కామెంట్?

News January 19, 2025

మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు

image

TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

News January 19, 2025

ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

image

TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.