News August 4, 2024
రేవంత్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన కేటీఆర్

TG: పెట్టుబడులే లక్ష్యంగా US, S.కొరియా పర్యటనకు వెళ్లిన CM రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుకు KTR ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో తాము KCR నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు TS-IPASS వంటి వినూత్న విధానాలను తీసుకొచ్చామన్నారు. పదేళ్లలో రూ.4లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లు, 24L ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమూ పెట్టుబడుల సాధనలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
Similar News
News January 29, 2026
సిమెంట్ ఉత్పత్తిలో భారత్ సత్తా.. మన దగ్గరే ఎక్కువ!

ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఎకనామిక్ సర్వే 2025-26 పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా 690M టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా AP, TG సహా 12రాష్ట్రాల్లోనే 85% పరిశ్రమలున్నాయి. అయితే ప్రపంచ సగటు తలసరి వినియోగం 540Kgs ఉండగా మన దేశంలో 290 కిలోలుగానే ఉంది. ప్రభుత్వాలు రోడ్లు, రైల్వే, గృహనిర్మాణ పథకాలపై దృష్టి సారించడం వల్ల సిమెంట్ వాడకం పెరుగుతుందని సర్వే పేర్కొంది.
News January 29, 2026
ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 29, 2026
రీసర్వేతో 86వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం: ఎకనమిక్ సర్వే

AP: రాష్ట్రంలోని 6,901 గ్రామాల్లో 81 లక్షల భూకమతాలను రీసర్వే చేసినట్లు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయని పేర్కొంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చినట్లు తెలిపింది. APలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. APతోపాటు పంజాబ్, UP, గుజరాత్‌కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.


