News March 12, 2025

గవర్నర్‌కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్

image

TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR <<15732904>>మాట్లాడారని <<>>పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి రావడాన్ని మహేశ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వానికి KCR సలహాలు ఇవ్వాలని సూచించారు.

Similar News

News March 12, 2025

త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

image

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.

News March 12, 2025

రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

image

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

News March 12, 2025

కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

image

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

error: Content is protected !!