News August 28, 2024
KTRను డిస్క్వాలిఫై చేయాలి: రేవంత్

TG: పార్టీలకతీతంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని CM రేవంత్ వెల్లడించారు. ‘మొదట కాంగ్రెస్ నేత పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా కూల్చింది. జన్వాడ ఫామ్‌హౌస్‌కు పంచాయతీ అనుమతులు లేవు. దీనిని లీజుకు తీసుకున్నట్లు KTR చెప్పారు. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదు? ఆయనను డిస్క్వాలిఫై చేయాలి. మా కుటుంబ సభ్యులకు అక్రమ నిర్మాణాలు ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొట్టిస్తా’ అని CM స్పష్టం చేశారు.
Similar News
News October 20, 2025
18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

AP: కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో 18 నెలల్లో ఒక్కటైనా వెలిగిందా అని YS జగన్ ప్రశ్నించారు. ‘రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి రూ.20,000, పిల్లలకు ఏటా రూ.15,000, ఇంటింటికీ ఏటా 3 ఉచిత సిలిండర్లు, ఉద్యోగులకిచ్చిన హామీలు.. ఇవన్నీ వెలగని దీపాలే కదా?’ అని ట్వీట్ చేశారు. తామందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులయ్యారంటూ విమర్శించారు.
News October 20, 2025
వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it
News October 20, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.