News November 14, 2024

KTRను జైలుకు పంపాలి: అర్వింద్

image

TG: లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో KTR హస్తం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గతంలో తనపై జరిగిన దాడిలో కూడా KTR పాత్ర ఉందన్నారు. ‘BRSను నామరూపాలు లేకుండా చేయాలి. KTRను జైలుకు పంపాలి. మళ్లీ బయటకు రాకూడదు. ఇంకా అహంకారంగానే, కొవ్వు పట్టినట్లే ఆయన మాట్లాడుతున్నారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News December 26, 2024

పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు

image

తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.

News December 26, 2024

రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.

News December 26, 2024

బాక్సింగ్ డే టెస్టుకు రికార్డ్ అటెండెన్స్

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ పోరును ప్రత్యక్షంగా చూసేందుకు తొలి రోజు 87,242 మంది తరలివచ్చారు. భారత్, ఆసీస్ మధ్య జరిగిన టెస్టులో ఒక రోజు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 311/6 పరుగులు చేసింది.