News March 29, 2024
కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: భట్టి

TG: మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి, తిరిగి మమ్మల్ని తిడుతున్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్లా తాము పాలనను గాలికి వదిలేసి, సోషల్ మీడియాకే పరిమితం కాలేదని భట్టి విమర్శించారు. ఇక ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 9, 2025
మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

TG: దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న HYDలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ రోజు 4PMకు ఆయన HYD చేరుకొని ఓ హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.
News December 9, 2025
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News December 9, 2025
పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.


