News January 9, 2025
నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ACB ఎదుట హాజరుకానున్నారు. సోమవారమే విచారణకు వచ్చిన ఆయన తన లాయర్‌ను లోపలికి అనుమతించడం లేదంటూ తిరిగి వెళ్లిపోయారు. దీంతో అదేరోజు ACB ఆయనకు నోటీసులు జారీ చేసి, 9న విచారణకు రావాలని పేర్కొంది. అటు లాయర్‌కు విచారణ గదిలోకి అనుమతి ఉండదని నిన్న HC స్పష్టం చేసింది. దీంతో KTR ఇవాళ విచారణకు ఒక్కరే వెళ్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News January 9, 2025
బూడిదైన అమెరికా అధ్యక్షుడి కొడుకు భవనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్‌కు చెందిన 75 ఏళ్ల ఇల్లు లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో కాలి బూడిదైంది. 3 పడకగదులతో కూడిన ఆ ఇంటితో పాటు ఇంటి ముందు నిలిపి ఉన్న కారు కూడా బూడిదకుప్పలా మారినట్లు సమాచారం. ఈ ఇంటిని 1950లో నిర్మించినట్లు తెలుస్తోంది. కాగా, కార్చిచ్చులో ఇప్పటి వరకు 2 వేల ఇళ్లు కాలినట్లు అంచనా. ఏకంగా 50 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.
News January 9, 2025
పోలీసులు, ఈవో ఫెయిలయ్యారు : పవన్
తిరుపతి తొక్కిసలాట ఘటన కచ్చితంగా నిర్వహణ వైఫల్యమే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. EO, AEO, పోలీసులు ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలన్నారు. క్రౌడ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఖాకీలు ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తాను వచ్చిన సమయంలోనూ ఇది నిరూపితం అయిందన్నారు. నిన్నటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు TTD, పోలీసులు వెళ్లి క్షమాపణ చెప్పాలని సీఎంకు సూచిస్తానన్నారు.
News January 9, 2025
నన్ను జైలులో పెట్టాలని చూస్తున్నారు: KTR
TG: తనను జైలులో పెట్టించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని KTR ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను జైలులో పెట్టించాలని చూస్తే, అది రేవంత్ కర్మ. ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. అడిగినవే మళ్లీమళ్లీ అడిగారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సీఎంను అడిగా. లైవ్‌లో చర్చిద్దామని చెప్పా. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంట్లో అయినా నేను సిద్ధమే’ అని సవాల్ విసిరారు.