News November 11, 2024

కేసుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీకి కేటీఆర్: మంత్రి పొన్నం

image

TG: తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే <<14582636>>కేటీఆర్ ఢిల్లీ<<>> వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఫార్ములా-ఈ రేసు కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్‌పై వచ్చిన అభియోగాలపై విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరామని చెప్పారు.

Similar News

News October 21, 2025

టీచర్లకు షాక్… TET మినహాయింపునకు NCTE తిరస్కరణ

image

దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. 5 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో <<17587484>>టెట్<<>> పాసవ్వాల్సిందేనని ఇటీవల SC తీర్పిచ్చింది. 2017 పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పిచ్చినందున అంతకు ముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని వారు కోరారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE తిరస్కరించింది.

News October 21, 2025

రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్‌కి జోడీ ఎవరు?

image

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT

News October 21, 2025

పని ప్రదేశాల్లో వేధింపులకు చెక్ పెట్టే షీ బాక్స్

image

పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు షీబాక్స్ పేరిట కేంద్రం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పనిప్రదేశాల్లో వేదింపులు ఎదుర్కొన్న మహిళలు షీబాక్స్ వెబ్‌సైట్లో ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అది అందిన వెంటనే సంబందిత విచారణ విభాగానికి బదిలీ అవుతుంది. బాధిత మహిళల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. వెబ్‌సైట్:<>https://shebax.wcd.gov.in/<<>>