News September 16, 2024
KTR.. నువ్వు చాయ్, సమోసా అమ్ముకునేవాడివి: రేవంత్

TG: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో KTRపై CM రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్ను పుట్టించి, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వేస్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News December 6, 2025
అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


