News December 31, 2024
KTR కామెంట్స్ బాధాకరం: దిల్ రాజు
TG: సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ పెద్దల భేటీపై <<15020792>>కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు<<>> బాధాకరమని నిర్మాత, FDC ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ‘సీఎంతో సమావేశంపై చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం సంకల్పాన్ని స్వాగతించాం. సినీ పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దు’ అని కోరారు.
Similar News
News February 5, 2025
నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’
ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్ వేసినట్లు పోస్టర్పై NTR అని ఉంచి ఇన్స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.
News February 5, 2025
రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి
AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్నాథ్ హామీ ఇచ్చారు.
News February 5, 2025
రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!
TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.