News March 26, 2025
అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.
Similar News
News March 29, 2025
నా సినిమా కోసం నేనెప్పుడూ ప్రార్థించలేదు: సల్మాన్

తన సినిమా హిట్ అవ్వాలని కోరుతూ ఎప్పుడూ దేవుడిని ప్రార్థించలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా సినిమా విజయం సాధించడమనేది ప్రేక్షకుల దయపై ఆధారపడి ఉంటుంది. ‘మైనే ప్యార్ కియా’కి తప్పితే ఎప్పుడూ సినిమా సక్సెస్ చేయమంటూ దేవుడిని ప్రార్థించలేదు. నన్ను ప్రేమించేవాళ్లే నాకోసం ప్రార్థనలు చేస్తుంటారు. నేను ఉత్తమ నటుడిని అని ఎప్పటికీ అనుకోను’ అని పేర్కొన్నారు.
News March 29, 2025
మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా?: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో అనేక రహదారులు ఏర్పడ్డాయని చెప్పారు. ‘మేం ఇచ్చిన హమీల అమలు బాధ్యత మాదే. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు. BJPలో అలా కాదు. JP నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు’ అని ఓ మీడియా కాంక్లేవ్‌లో తెలిపారు.
News March 29, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.