News February 3, 2025
సుప్రీంకోర్టులో KTR పిటిషన్.. 10న విచారణ

TG: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.
Similar News
News October 23, 2025
తదుపరి చీఫ్ జస్టిస్ కోసం కేంద్రం కసరత్తు

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కొత్త సీజేఐ పేరును సిఫార్సు చేయాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ని కోరింది. కాగా SC సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్కు తదుపరి సీజేఐగా అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనుంది.
News October 23, 2025
WWC: ప్రతీకా రావల్ సెంచరీ

న్యూజిలాండ్తో మ్యాచులో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ చేశారు. 122 బంతుల్లో 13 ఫోర్లతో శతకం నమోదు చేశారు. ఇప్పటికే సెంచరీ చేసిన స్మృతి మంధాన 109 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. వీరిద్దరూ 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ప్రతీకాతో పాటు రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 38.1 ఓవర్లకు 239/1.
News October 23, 2025
నిబంధనలు పాటించని కాలేజీలపై ఫిర్యాదు చేయండి: APSCHE

AP: కొన్ని కాలేజీలు GOVT రూల్స్ పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) తెలిపింది. ‘కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారి నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవ్వకుంటే అడ్మిషన్ నిరాకరిస్తున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధ చర్యలు తీసుకోవడం లేదు. మహిళలపై వేధింపుల నివారణలోనూ విఫలమవుతున్నాయి’ అని పేర్కొంది. వీటిపై తమకు లేదా వర్సిటీకి, APHERMCకి ఫిర్యాదు చేయాలని సూచించింది.