News April 8, 2025
ఎన్డీఏ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్

TG: అచ్చే దిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం(NDA) ఒక్కరోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సెటైర్ వేశారు. LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు, చమురు ధరలు కనిష్ఠానికి పడిపోయినా ఇంధనంపై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపు, సెన్సెక్స్ రూ.19 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని దుయ్యబట్టారు. అచ్చే దిన్కు ఇవి సంకేతాలా లేక భారత్ను గొప్పగా మార్చేందుకు ప్రారంభమా అని ప్రశ్నించారు.
Similar News
News October 23, 2025
కార్తీక మాసం: ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

ఉల్లి, వెల్లుల్లి రజో, తమో గుణాల ప్రభావాన్ని పెంచుతాయి. రజో గుణం మనస్సులో కోరికలను పెంచుతుంది. తమో గుణం వల్ల బద్ధకం, అజ్ఞానం ఆవరించే అవకాశాలుంటాయి. ఇది దైవ స్మరణ కోసం కేటాయించిన పవిత్ర సమయం. ఈ సమయంలో పూజలు ఏకాగ్రతతో చేయాలంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. అది జరగాలంటే భగవత్ చింతనకు ఆటంకం కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం వీటిని తినకుండా ఉండటం ఉత్తమం అని సూచిస్తుంటారు.
News October 23, 2025
మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.
News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.