News July 8, 2025

కేటీఆర్ సెకండ్ బెంచ్ స్టూడెంట్: జగ్గారెడ్డి

image

TG: తమకున్న అనుభవాల ముందు KTR జీరో అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. KTR సెకండ్ బెంచ్ స్టూడెంట్. తన తండ్రి ఎమ్మెల్యే సీటు ఇస్తే డైరెక్ట్‌గా గెలిచారు. కేటీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే పది మాటలు అంటాం. అనడం మానేస్తే మేమూ మానేస్తాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 8, 2025

US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

image

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్‌’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.

News July 8, 2025

‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

image

2026-27 విద్యాసంవత్సరానికి 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది అదే క్లాసు చదువుతున్నవారు అర్హులు. AP, TG సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. cbseitms.rcil.gov.in/nvs వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.