News September 24, 2025
KUలో LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు..!

కేయూలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8, 10, 14, 16, 18వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. అక్టోబర్ 9, 13, 15, 17వ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు LLB ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఇతర వివరాలకు కేయూ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News September 24, 2025
కొత్తగూడెం: 1258 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1258 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ బుధవారం సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థలు బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తూ 190/240 మాస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ-1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎండీ తెలిపారు.
News September 24, 2025
CJI పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసును విచారించాలి: మత్తయ్య 1/2

తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఓటుకునోటు కేసులో జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పలు అంశాలు పేర్కొన్నారు. CJI లేదా తెలంగాణేతర రాష్ట్ర HCతో కేసు పునర్విచారణ చేయాలన్నారు. నాడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి TDP మహానాడుకు పిలిపించి స్టీవెన్సన్‌ను ఒప్పించేలా తనతో నేరం చేయించారని ఆరోపించారు. లోకేశ్‌తో పాటు నాటి ఇంటెలిజెన్స్, ACB అధికారులు, లాయర్లు సహా అందరినీ నిందితులుగా చేర్చాలన్నారు.
News September 24, 2025
రేవంత్ రెడ్డిని సీఎంగా తొలగించాలి: మత్తయ్య 2/2

అప్పటి TG సీఎం కేసీఆర్ పేర్కొన్న సాక్ష్యాలను విచారణలో మెన్షన్ చేయలేదని మత్తయ్య అన్నారు. ’రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు. వారు విచారణను తప్పుదోవ పట్టించి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉంది. విచారణ ముగిసే వరకు వారిని తొలగించాలి‘ అని కోరారు. TDP, INC పార్టీల ప్రభుత్వాలనూ రద్దు చేయాలన్నారు. లోతైన విచారణ లేకుండా ఈ కేసును నాటి హైకోర్టు జడ్జి స్క్వాష్ చేశారని ఆరోపించారు.