News March 20, 2024
KU: ఈనెల 22 నుంచి ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి హెచ్. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News April 11, 2025
వరంగల్ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
News April 11, 2025
నేడే జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొండా

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్‌లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.
News April 11, 2025
వడ్డేపల్లి చెరువులో దూకి NIT విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. వడ్డేపల్లి చెరువులో దూకి వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్‌సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, హైదరాబాద్‌కు చెందిన అతను ఎన్‌ఐటీ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.