News October 17, 2024
KU డిగ్రీ, పీజీ బ్యాక్లాగ్ పేపర్లకు అనుమతి: రిజిస్ట్రార్
కేయూ పరిధిలోని డిగ్రీ, పీజీ బ్యాక్లాగ్ విద్యార్థులకు 2024- 25 విద్యా సంవత్సరం కాలపరిమితికి సంబంధించి రాత, ప్రాక్టికల్, సెమినార్ పరీక్షలు క్లియర్ చేయడానికి అనుమతి ఇస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పరీక్షా ఫీజుకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
Similar News
News November 27, 2024
వాంకిడి: మహారాష్ట్ర సరిహద్దులో పులి సంచారం
వాంకిడి మండలం మహారాష్ట్ర సరిహద్దులో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం ఏకో వంతెన వద్ద పులి సంచరిస్తుండగా వాహనదారులు వీడియోలు తీశారు. రెండు రోజుల క్రితం పశువుల మందపై దాడి చేసి నాలుగు పశువులను గాయపరిచిన పులి మహారాష్ట్ర వెళ్ళిపోయిందని అధికారులు భావించారు. కానీ వాంకిడి- మహారాష్ట్ర సరిహద్దులో తిరుగుతూ సరిహద్దు గ్రామాల ప్రజలను కలవరపెడుతోంది.
News November 27, 2024
ADB: రిమ్స్ డ్రగ్ స్టోర్ను పరిశీలించిన నోడల్ అధికారి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డ్రగ్ స్టోర్ ను వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వలపై తో పాటు రిజిస్టర్లు పరిశీలించారు. మందుల కొరత నివారించడానికి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్. నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, తదితరులు ఉన్నారు.
News November 27, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు ఇవే.
కాగజ్నగర్: భర్తను హత్యా చేసిన భార్య
వాంకిడి: రేపటి విద్యాసంస్థల బందుకు మద్దతు
మంచిర్యాల: పట్టుబడిన గంజాయి దహనం
కుబీర్: భార్యను హత్యా చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు
ADB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
వాంకిడి: శైలజ మృతిపై ధర్నా, రాస్తారోకోలు