News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News November 2, 2025

NHలపై ప్రమాదాలు.. కాంట్రాక్టర్లకు భారీ ఫైన్లు

image

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 500M పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్‌కు ₹25L, మరుసటి ఏడాదీ యాక్సిడెంట్ జరిగితే ₹50L ఫైన్ విధించనుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేస్తామని, ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని ఓ అధికారి వెల్లడించారు.

News November 2, 2025

జనగామలో రేపటి ప్రజావాణి రద్దు

image

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా సర్వేలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.