News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 30, 2025

WGL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘ కీ ‘ రోల్ కాబోతుంది.

News March 30, 2025

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. 

News March 29, 2025

మే 23 నుంచి వారం పాటు 30 రైళ్లు రద్దు

image

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.

error: Content is protected !!